టిక్‌టాక్ నిషేధంపై ట్రంప్‌నకు ఎదురుదెబ్బ

-

చైనా సోషల్ మీడియా యాప్స్ టిక్‌టాక్, వీచాట్ డౌన్‌లోడ్ల నిషేధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. వీచాట్, టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేయకుండా నిరోధించే ట్రంప్ జారీ చేసిన ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు వాషింగ్టన్‌లోని కోర్టు న్యాయమూర్తి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 11:59 గంటలకు అమలులోకి వస్తుందని తెలిపారు. తాజా ఉత్తర్వులపై టిక్‌టాక్ సంతోషం వ్యక్తం చేసింది.

యాపిల్, గూగుల్ సోర్లలో నిషేధం అమల్లోకి రాకుండా నిరోధిస్తూ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జిల్లా జడ్జి కార్ల్ నికోలస్ వెల్లడించారు. అయితే నవంబర్ 12 నుండి అమల్లోకి రానున్న ఇతర వాణిజ్య శాఖ ఆంక్షలను నిరోధించడానికి నికోలస్ నిరాకరించారు. మరోవైపు ఈ విషయంలో ఒకవైపు చర్చలు జరుగుతుండగా, రాత్రికి రాత్రికి టిక్‌టాక్ డౌన్‌లోడ్‌లపై నిషేధం ఎలా విధిస్తారంటూ ఆదివారం నాటి విచారణలో టిక్‌టాక్ తరపు న్యాయవాది జాన్ ఈ హాల్ వాదించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version