అభిమాని వీడియోకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా ..

-

మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న అంద‌రికీ తెలిసిందే.
ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్ట‌గ్రామ్‌తోపాటు ట్విట‌ర్‌లో వీడియోల‌ను పోస్టు చేస్తూ అభిమానుల‌ను అ ల‌రిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా అభిమాని షేర్ చేసిన వీడియోకు ఫిదా అయ్యారు. సినిమాల‌కు కొంత కాలం దూరంగా ఉన్న చిరంజీవి టూరిజం మినిస్ట‌ర్‌గా త‌న సేవ‌ల‌ను అందించారు. సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ టూరిజం డే కావ‌డంతో చిరంజీవి టూరిజంకు సంబంధించి చేసిన గొప్ప ప‌నుల‌ను అభిమాని వీడియో రూపంలో త‌యారు చేసి షేర్ చేశాడు. దీనికి చిరు స్పందిస్తూ.. ఆ క్ష‌ణాల‌ను గుర్తుకు తెచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అభిమాని పంపిన వీడియోను చూశాను. గౌర‌వంగా అనిపించింది. ఎన్నో జ్ఞాప‌కాలు నా మ‌దిలో మెదిలాయి. ఇంక్రెడిబుల్‌ ఇండియా కార్యక్రమం కోసం సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మ‌న దేశ ఖ్యాతిని పెంచేందుకు నాకు త‌క్కువ స‌మ‌యమే దొరికినప్ప‌టికీ, అత్యుత్త‌మ సేవ‌లు అందించ‌డం, గొప్ప జ్ఞాప‌కాలు పొంద‌డం సంతోషాన్నిస్తుంది. జైహింద్ అంటూ చిరు త‌న‌ అభిమాని ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version