పబ్లిక్ పరీక్షల్లో విజయం సాధించానుకుంటారా…? అయితే ఇలా చెయ్యండి…!

సహజంగా ఫైనల్ పరీక్షలు అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. అలానే గుర్తుండదేమో అనే ఆందోళన కూడా వెంటాడుతుంది. చదివింది ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం నిజంగా కష్టం.అయితే మరి పరీక్షల వరకు చదివింది గుర్తు ఉండాలి అంటే ఏం చెయ్యాలి..? ఈ విషయం లోకి వస్తే… చదివింది బాగా గుర్తుండాలి అంటే తప్పకుండ ‘పునశ్చరణ’ (రివిజన్) చెయ్యాలి. ఎలానో మొదట నుండి అంత చదివేస్తారు కనుక ఎక్కువ కాలం గుర్తుంచుకోవాలంటే రివిజన్ చేయాలని సైకాలజిస్టులు చెబుతున్నారు.

సమయాన్ని సరిగ్గా వినియోగిస్తూ రివిజన్ పూర్తి చేసేస్తే మరో సారి రివిజన్ చేసుకోండి. ఎన్ని సార్లు రివిజన్ చేస్తే అంత బాగా మీకు గుర్తుంటుంది. అలానే రివిజన్ వల్ల చదివింది మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు కనుక పరీక్షల్లో మర్చిపోవడం అనేది ఉండదు. దీన్నే ‘రిట్రీవల్‌ ప్రాక్టీస్‌’ అని కూడా పిలుస్తారు. అంటే.. ‘తిరిగి పొందడం లేదా గుర్తుకు తెచ్చుకోవడం’ అన్న మాట.

ఇది ఒక విధానం అయితే మరో విధానం కూడా ఉంది. అదేమిటంటే..? ‘ప్రాక్టీస్‌ టెస్ట్’‌. ఈ ప్రాక్టీస్‌ టెస్ట్‌ లో చదివిన చాప్టర్‌పై పరీక్షల కోణం లో నిపుణులు ప్రశ్నలు తయారు చేస్తారు. వాటికి జవాబులు రాసి చెక్ చేసుకుంటారు. ఇలా చెయ్యడం వల్ల కూడా బాగా గుర్తుంటుంది. ఈ పద్ధతిని పాఠశాలల్లో కూడా ఉపయోగిస్తారు. ఇలా వీటిని అనుసరిస్తే మరచిపోకుండా పరీక్షల్లో సఫలం అవుతారు.