ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై సాంకేతిక నిఘా!

-

యూనియన్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్ట్రీ ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై కొరడ ఝళిపించనుంది. తాజాగా దీనికి సంబంధించిన సూచనలు చేసింది. ఇక ఎలక్ట్రానిక్‌ పరికరాల ఆధారంగా ట్రాఫిక్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేసేవారికి చలానాలు విధించనున్నారు. గురువారం ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించే వారిపై చర్య తీసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాహనాల నియమం 1989 ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్, రోడ్డు భద్రత అమలును సవరించే నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఎలక్ట్రానిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పరికరాలు చలానాలు జారీ చేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు.

Traffic control with google maps In Hyderabad traffic police
Traffic control with google maps In Hyderabad traffic police

కొత్త టెక్నాలజీ వివరాలు..

  • సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు జారీ ఆమోదించిన ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది. పరికరం కచ్ఛితమైంది అని ధ్రువీకరణ పత్రం ద్వారా తెలుస్తుంది. ఇది ప్రతి సంవత్సరం రెనివల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ పరికరాలకు స్పీడ్‌గా పనిచేసే కెమెరా, క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టెలివిజన్‌ కెమెరా, స్పీడ్‌ గన్, బాడీ వేరబుల్‌ కెమెరా, డ్యాష్‌బోర్డ్‌ కెమెరా, ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ గుర్తించడం, వెయిట్‌ ఇన్‌ మెషీన్‌ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న ఇతర టెక్నాలజీని కలిఇ ఉంటుంది.
  • ఈ సాంకేతిక పరికరాలను జాతీయ, రాష్ట్ర రహదారులపై, రిస్కీ జంక్షన్ల వద్ద, అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో, అధిక సాంద్రత కలిగిన కారిడార్ల వద్ద ఉంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ నోటిఫికేషన్‌లో 132 నగరాలను సూచించింది. అక్కడ కనీసం ఒక మిలియన్‌ కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఉంచాలి. ఆ పరికరాలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏ సమస్యలు రాకుండా ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఏదైనా తప్పు జరిగినట్లయితే.. 15 రోజులలోపు నోటీసు పంపాలి. అలాగే ఎలక్రానిక్‌ ఫూటేజీలను సేకరించి, చలానాలను పారవేసే వరకు అవి సేఫ్‌గా ఉంచాల్సి ఉంటుంది.
  • ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేకరించిన ఫూటేజీల ద్వారా నిర్ధేశించిన స్పీడ్‌ కంటే ఎక్కువ స్పీడ్‌లో డ్రైవింగ్‌ చేసిన వారికి నో పార్కింగ్‌ వద్ద వాహనాలు నిలిపిన వారికి, హెల్మెట్‌ ధరించని వారికి , రెడ్‌ సిగ్నల్‌ జంప్‌ చేస్తే, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే, ఇతర వాహనాలను ఓవర్‌టేక్‌తోపాటు ఇతర ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై చలానాలను విధించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news