IRCTC రణ్ ఉత్సవ్ టూర్ ప్యాకేజీ… పూర్తి వివరాలు మీకోసం…!

-

ప్రతీ సంవత్సరం గుజరాత్‌లో రణ్ ఉత్సవ్ జరుగుతుంది. చాలా మంది రణ్ ఉత్సవ్ కోసం ఎదురు చూస్తుంటారు. ప్రతీ ఏటా ఓ ప్రత్యేక ఆకర్షణగా ఇది ఉంటుంది. అయితే ఈ రణ్ ఉత్సవ్ కి వెళ్లేందుకు IRCTC కొత్త టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది.దీనితో హ్యాపీగా టూర్ వేసి వచ్చేయచ్చు. రణ్ ఉత్సవ్‌ కోసం ట్రైన్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. పూర్తి వివరాలను చూస్తే..

 

ముంబై నుండి ఇది ప్రారంభం అవుతుంది. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. నవంబర్ 30 నుంచి ప్రతీ బుధవారం ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. కనుక ఈ టూర్ వేసి వచ్చేయాలనుకునేవారు ఈ సమయంలో ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. టూర్ వివరాలను చూస్తే.. రణ్ ఉత్సవ్ టూర్ మొదటి రోజు ముంబైలో స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4.45 గంటలకు బాంద్రా టెర్మినస్ స్టేషన్‌లో ట్రైన్ ఎక్కాలి.

బోరివలి, సూరత్, వడోదరలో ట్రైన్ ఆగుతుంది. రెండో రోజు ఉదయం భుజ్ చేరుకుంటారు. వైట్ రణ్ రిసార్ట్స్‌కు అక్కడ నుండి వెళ్ళాలి. వైట్ రణ్ రిసార్ట్స్‌కు చేరుకున్నాక చెక్ ఇన్ అవ్వాలి. సూర్యాస్తమయాన్ని చూడచ్చు. అలానే రాత్రికి కల్చరల్ యాక్టివిటీస్ కూడా వున్నాయి. రెండవ రోజు నైట్ వైట్ రణ్ రిసార్ట్స్‌లో స్టే చెయ్యాలి. మూడో రోజు కచ్ ప్రాంతంలో సూర్యోదయాన్ని చూసేందుకు వెళ్ళాలి. దుంగర్ టూర్ ఉంటుంది. హస్తకళల గ్రామం వంటివి చూడచ్చు.

నాలుగో రోజు రణ్ రిసార్ట్స్ నుంచి చెక్ అవుట్ అయ్యాక భుజ్ వెళ్ళాలి. శ్రీ స్వామి నారాయణ్ టెంపుల్, కచ్ మ్యూజియం, భుజోడి ని దారిలో చూడచ్చు. తరవాత ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే ముంబై రీచ్ అవుతారు. ధరని చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.16,350, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.18,500, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.33,050 చెల్లించాలి. ఇవి కంఫర్ట్ ప్యాకేజీకి. అదే డీలక్స్ ప్యాకేజీలో చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.17,950, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.20,500, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.34,650 చెల్లించాలి. పూర్తి వివరాలని IRCTC అధికారిక వెబ్ సైట్ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news