ప్రకృతి వీక్షకులని కనువిందు చేసే పాండవుల గుట్ట

-

పాండవుల గుట్టల్లో ఎదురు పాండవులు, గొంతెమ్మ గుహ, పంచ పాండవులు, పోతిరాజు చెలిమె, మేకలబండ, ముంగీస బండ, తుపాకుల గుండు, యానాదుల గుహలు చూడాల్సిన ప్రదేశాలు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు పర్యాటకులని బాగా ఆకట్టుకుంటాయి. ప్రకృతి అందాలకు నెలవు పాండవుల గుట్టలు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుట్టలు ఇప్పుడు ప్రతీ ఒక్కరిని బాగా ఆకట్టుకుంటున్నాయి.

రాక్‌ క్లైమ్బింగ్, ట్రెక్కింగ్‌ వంటి విన్యాసాలకు అనుకూలంగా ఉంది ఇది. దీని మూలం గానే దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తూ ప్రకృతి ఒడి లో సేద తీరుతున్నారు. ఇక్కడ పాండవులు నడయాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. 1990 లో ప్రభుత్వం వీటిని గుర్తించింది. ఇది ఇలా ఉండగా ఇక్కడ పంచపాండవుల గుహలో రంగులలో పంచ పాండవులు, కుంతి, ద్రౌపది, ద్రుపదుడు, పాండవుల పెండ్లి, శేషశాయి, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతుల చిత్రాలున్నాయి.

ఈ ప్రదేశాన్ని ప్రతీ రోజు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓపెన్ చేసి ఉంచుతారు కనుక ఈ సమయాల్లో వెళ్లి చూడొచ్చు. పాటల ఆల్బమ్స్‌, షార్ట్‌ ఫిలింస్ కి ఇది అనుకూలం. గొంతెమ్మ గుహ, పంచపాండవుల గోనెల్లో అద్భుతమైన శిల్ప సంపద ఉంది. ఈ పాండవుల గుట్టల పైనే బుగు లోని వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. దగ్గరే కనుక ఆ ఆలయాన్ని కూడా చూడొచ్చు. పాండవుల కాలం నాటి చిత్రాలు, పెయింటింగ్‌ అద్భుతంగా ఉన్నాయి. శిల్ప కళా ఆకృతి ఆకట్టుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news