తెరుచుకున్న తాజ్‌మ‌హ‌ల్.. కండిష‌న్లు ఇవే..‌

-

హ‌మ్మ‌య్య‌.. ఎట్టకేల‌కు మ‌ళ్లీ అందాల తాజ్‌మ‌హ‌ల్‌ను చూసే అవ‌కాశం ప‌ర్యాట‌కుల‌కు ద‌క్కింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ నేప‌థ్యంలో తాజ్‌మ‌హ‌ల్ సంద‌ర్శ‌న‌ను మార్చి 17న నిలిపివేశారు. అంటే దాదాపుగా ఆరు నెల‌ల త‌ర్వాత‌ అన్‌లాక్ -4లో భాగంగా ఈ నెల 21 నుంచి తాజ్‌ మహల్‌, ఆగ్రా ఫోర్ట్‌ తెరుచుకున్నాయి. కొవిడ్‌ మార్గదర్శకాల మేరకు పర్యాటకులను ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు అనుమతి ఇస్తున్నారు. రోజుకు సుమారు 5వేల మంది పర్యాటకులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

తాజ్‌మహల్‌ సందర్శనకు మధ్యాహ్నం వరకు 2500, ఆ తర్వాత మరో 2500 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. క‌రోనా వైరస్‌ వ్యాప్తి నిరోధ‌క చ‌ర్య‌ల్లో భాగంగా పేపర్‌ టికెట్ల జారీని నిలిపి వేసి, ఎలక్ట్రానిక్‌ టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి చేశారు. అలాగే ఎప్పటికప్పుడు అధికారులు శానిటైజ్‌ పనులు చేపట్టనున్నారు. అయితే.. మ‌ళ్లీ తాజ్‌మ‌హ‌ల్ అందాల‌ను వీక్షించే అవ‌కాశం రావ‌డంతో ప‌ర్యాట‌కులు ఆనంద‌ప‌డుతున్నారు. కొవిడ్‌-19 కార‌ణంగా గ‌తంలోలాగా.. పెద్ద‌గా సంద‌ర్శ‌కులు రాక‌పోవ‌చ్చున‌ని అధికార‌వ‌ర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news