విహార యాత్రలకు చాలా మంది ఇతర దేశాలకు వెళ్తుంటారు. కానీ నిజానికి మన దేశంలోనూ విహారానికి వెళ్లేందుకు అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా అడవుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కనీసం ఏడాదికి ఒకసారి అయినా ఒక వారం పాటు అడవుల్లో గడిపేలా టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ట్రెక్కింగ్‌కు అయినా సరే మన దేశంలోనే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తమిళనాడులోని మదుమలై
మదుమలై ప్రాంతం దట్టమైన అరణ్యాలతో నిండి ఉంటుంది. ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఉంది. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. అక్కడ సుమారుగా 330 జాతులకు చెందిన జీవులు కనిపిస్తాయి. దట్టమైన అరణ్యాలు, పచ్చని ప్రకృతి, కొండ ప్రాంతాలతో ఈ ప్రదేశం ట్రెక్కింగ్‌కు అత్యంత అనువుగా ఉంటుంది. పర్యాటకులు బాగా ఎంజాయ్ చేయవచ్చు.
2. వయనాడ్ చెంబ్రా ట్రెక్
కేరళలో ఈ ప్రాంతం ఉంది. సముద్ర మట్టానికి సుమారుగా 2100 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. కేరళలోని వయనాడ్ పర్వత శ్రేణుల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. అత్యంత ఎత్తయిన పశ్చిమ కనుమలు ఉంటాయి. సహజసిద్ధమైన అందంతో ఇక్కడి ప్రకృతి ఉంటుంది. ట్రెక్కింగ్‌కు అనువుగా ఉంటుంది.
3. మౌంట్ హారియెట్ నేషనల్ పార్క్
ఈ పార్క్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. అద్భుతమైన తీర ప్రాంతాలు ఉంటాయి. బీచ్‌లు పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ఇది కూడా పచ్చని ప్రకృతితో అందంగా దర్శనమిస్తుంది. ట్రెక్కింగ్ చేయవచ్చు.
4. కోటిగావో అండ్ నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ
ఇది గోవాలో ఉంది. అద్బుతమైన బీచ్‌లు, పచ్చని ప్రకృతి దర్శనమిస్తాయి. ఇక్కడి పర్వతాల్లో పర్యాటకులు ట్రెక్కింగ్ చేయవచ్చు.
5. తడోబా
మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి అటవీప్రాంతం ముగ్ధ మనోహరంగా ఉంటుంది. పులులకు ఈ ప్రాంతం పేరుగాంచింది. ఇక్కడి పర్వతాలపై పర్యాటకులు ట్రెక్కింగ్ చేయవచ్చు.