తెనాలిని ఆంధ్రా ప్యారిస్‌ అని ఎందుకు అంటారు..?

-

ఆంధ్రాల్లో ఉన్న ఫేమస్ ప్లేసుల్లో తెనాలి కూడా ఒకటి. మీకు తెలుసో లేదో తెనాలని ఆంధ్రా ప్యారిస్‌ అంటారు. అలా అని తెనాలి ఏం ప్యారిస్‌లా ఉండదు. అంత మాములగానే ఉంటుంది. అయినా ఈ పేరు ఎందుకు వచ్చిందో..? ఏ కారణం లేకుండా అయితే ఈ పేరు పెట్టరు కదా..! తెనాలి ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందింది. వికటకవి గార్లపాటి రామలింగం సొంత పేరుతో కాకుండా తెనాలి రామకృష్ణుడిగా ప్రసిద్ధి చెందాడు. తెనాలి ఇంటిపేరు కానప్పటికీ తన ప్రతిభతో, తెనాలి పేరును నలువైపులా చాటారు. ఇక మనం ఈరోజు తెనాలికి ఆంధ్రా ప్యారిస్‌ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దామా..!

ఎన్నో శతాబ్దాలుగా పారిస్ కళలకు ప్రసిద్ధి చెందింది. అక్కడి స్టేజి డ్రామాలు, నాటక ప్రదర్శనలు చూడడం కోసం కళాప్రియులు వేరే ప్రాంతాల నుండి, వేరే దేశాల నుండి తరలి వస్తుండేవారట. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి కూడా ప్రాచీన కాలంలో పారిస్ లాగే కళలకు నెలవుగా ఉండేది. ఆరోజుల్లో ఈ విషయం గమనించిన ఆంధ్రాలో ఉండే బ్రిటిష్ కళాప్రియులు తెనాలిని ‘ఆంధ్రా పారిస్’ అని పిలిచే వారట. తెనాలి ఒక ప్రాచీన చారిత్రక నగరం. తెనాలి పూర్వం కాలం నుండి కళలకు పుట్టిల్లు. ఎందరో కవులను, పండితులను, కళాకారులను ఇచ్చిన కళాకేంద్రం తెనాలి. శ్రీకృష్ణదేవరాయలవారి అష్టదిగ్గజ కవులలో ఒకరిగా ప్రసిద్ది చెందిన వికటకవి తెనాలి రామకృష్ణుడి గురించి అందరికి తెలిసిందే.

తెలుగు సినీ పరిశ్రమలో తొలి హీరో గోవిందరాజుల సుబ్బారావుగారు, తొలి హీరోయిన్ కాంచనమాల కూడా తెనాలి వారే. కృష్ణ, సావిత్రి, గుమ్మడి వెంకటేశ్వరరావు, జమున, శారద, జగ్గయ్య, రమాప్రభ, దివ్యవాణి, ఎవియస్, శివపార్వతి లాంటివారు ఎంతో మంది తెనాలి, తెనాలి చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి వచ్చినవారే.

సో.. అలా తెనాలికి ఆంధ్రా ప్యారిస్‌ అనే పేరు వచ్చింది. తెనాలి వాళ్లకు కూడా ఈ విషయం తెలుసో లేదో.. మీ దోస్తుగాళ్లు తెనాలిలో ఉంటే వారిని అడిగి చూడండి..!

Read more RELATED
Recommended to you

Latest news