కరోనా తగ్గిపోయింది, అందరూ ఆఫీసులకు వెళ్తున్నారు, అసలు మాస్కులు వేసుకోవడం మానేశారు, ఇంట్లో ఉన్నా ఆ క్లాత్ మాస్క్‌లను కూడా మూలకుపడేసి ఉంటారే..! కానీ మళ్లీ ఆ మాస్కులతో పనిపడింది. కొత్త వేరియంట్ జెట్ స్పీడ్‌లో వ్యాపిస్తోంది. తాజాగా EG.5.1 వేరియంట్‌కు మారుపేరు అయిన Eris తో కరోనా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మునుపటి నివేదికలతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. యూకేలో Eris కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుందని అక్కడి హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి.ఈ ఏజెన్సీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జులై రెండో వారంలో 11.8 శాతం Eris కేసులు బయట పడ్డాయి. ప్రజల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ ప్రజారోగ్య పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని 2023 మే 5న కోవిడ్ పెద్ద ముప్పుగా మిగిలిపోతుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం XBB.1.5, XBB.1.16 పర్యవేక్షణలో ఏడు రకాలు (VUMలు) వేరియంట్లు ఉన్నాయి. వాటి ఉప వేరియంట్లు BA.2.75, CH.1.1, XBB, XBB.1.9.1, XBB.1.9.2, XBB.2.3, EG.5. WHO తాజా నివేదిక ప్రకారం EG.5 దాదాపు 45 దేశాల్లో కనుగొనబడింది.
సినిమా విడుదల కేసులు పెరగడానికి కారణమా..?
కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ వ్యాప్తి చెందటానికి “బార్బీ”, “ఓపెన్ హైమర్” సినిమా విడుదల అని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటి విడుదల కారణంగా ప్రజలు అధిక సంఖ్యలో ఒక చోట చేరడంతో కేసుల సంఖ్య పెరగినట్లు చెప్తున్నారు. చెడు వాతావరణం, రోగనిరోధక శక్తి క్షీణించడం కూడ కేసు పెరుగుదలకి ఇతర కారణాలుగా చెప్తున్నారు.
యూఎస్ లో కూడా
యూఎస్ సీడీసీ కోవిడ్ ట్రాకర్ నివేదిక ప్రకారం డిసెంబర్ నుంచి కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్న వారి రేటులో 10 శాతం పెరుగుదల నమోదు చేసుకున్నాయి. కరోనా కారణంగా 8,035 మంది హాస్పిటల్ పాలయ్యారు. జూన్ నుంచి ఈ కేసులు పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు అక్కడి ఆరోగ్య ఏజెన్సీలు చెబుతున్నాయి. వేడి వాతావరణం కారణంగా ప్రజలు గాలి ప్రసరణ సరిగా లేని ఇంటి లోపల ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అటువంటి వాతావరణం వల్ల శ్వాసకోశ వైరస్లు వ్యాప్తి ఎక్కువగా ఉంది.
లక్షణాలలో ఏమైనా మార్లపులు ఉన్నాయా..
మునుపటి వేరియంట్లలో కనిపించే కోవిడ్ లక్షణాలే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. తలనొప్పి, జ్వరం, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.
ఇక కరోనా వ్యాప్తి జరగకుండా ఉండటం కోసం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, బయటకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం ముఖ్యం.