తెలంగాణ ప్రభుత్వం: ప్రైవేట్ టీచర్లకు రెండు వేల రూపాయలు, 25 కేజీల బియ్యం… ఎలా అప్లై చేసుకోవాలంటే…

-

ప్రైవేట్ టీచర్లకి సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకువచ్చింది. ఏప్రిల్ 2021 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకి 2000 రూపాయలు మరియు 25 కేజీల బియ్యాన్ని ఇవ్వనున్నారు.ఈ కొత్త స్కీమ్ ని ప్రైవేట్ టీచర్ల కోసం తీసుకు రావడం జరిగింది. గుర్తింపు పొందిన పాఠశాలల లో పని చేసే వర్కింగ్ స్టాప్ మరియు టీచర్లకి ఈ బెనిఫిట్ కలుగుతుంది.

డబ్బులు
డబ్బులు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్ని మరియు ప్రభుత్వ పాఠశాలల్ని కూడా జూన్ 2021 వరకు మూసివేశారు. తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయి అనే వాటి కోసం సమాచారం లేదు. అందుకోసం ప్రభుత్వం సహాయం చేయాలని ఈ స్కీమ్ ని తీసుకు వచ్చింది. అర్హత కలిగిన ప్రైవేట్ టీచర్లు, స్టాఫ్ ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.

దీని కోసం ఎలా అప్లై చేసుకోవాలి అంటే…?

స్టాఫ్ మరియు ప్రైవేటు టీచర్లు సమీపం లో ఉన్న రేషన్ షాప్ లోకి వెళ్లి గుర్తింపు పొందిన పాఠశాల ఐడెంటిటీ కార్డ్ చూపించి 25 కేజీల బియ్యం తీసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫిల్ చేయడంతో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జెరాక్స్, స్కూల్ టీచర్ ఐడి కార్డు, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ లో ఇవ్వాలి.

ఈ స్కీమ్ కి అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్:

డిఈఓ మరియు అన్ని ఎంఈఓ కి ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత రెండు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ మొదటి పేజీ, స్కూల్ ప్రిన్సిపాల్ ఇచ్చిన ఐడెంటిటీ కార్డ్, టీచర్ మరియు స్టాప్ అటెండెన్స్ షీట్, రేషన్ కార్డు లేదా కరెంట్ బిల్లు. పూర్తి వివరాలని మీరు www.schooledu.telangana.gov.in లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news