మీకు టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ ఉందా..? అయితే మీరు తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి. లేదంటే మీరు ఈ విషయాల్లో మోసపోవాల్సి ఉంటుంది. ఇక అసలు విషయం లోకి వెళితే… ఐఆర్‌డీఏఐ తాజాగా వాహనదారులను హెచ్చరించింది. ఈ మేరకు వాహనదారులకు జాగ్రత్తగా ఉండాలని… ఫేక్ ఇన్సూరెన్స్ ప్రొడక్టుల తో జాగ్రత్తగా ఉండాలని ఐఆర్‌డీఏఐ వాహనదారులను హెచ్చరించింది. మీరు కనుక సరిగ్గా గమనించక పోతే మోసపోవాల్సిందే.
ఐఆర్‌డీఏఐ వాహనదారులను హెచ్చరిస్తూ ఒక నోటీసు జారీ చేసింది. ఫేక్ ఇన్సూరెన్స్ ప్రొడక్టులు విక్రయించే వెబ్‌సైట్, ఈమెయిల్‌తో జాగ్రత్తగా ఉండాలని వాహనదారులను అలర్ట్ చేసింది. ఇది ఇలా ఉండగా [email protected] నుంచి చాలా మంది వాహనదారులకు ఇన్సూరెన్స్ సంబంధిత ఈమెయిల్స్ వస్తున్నాయని చెప్పింది. అయితే తక్కువ ధరలోనే ఇన్సూరెన్స్ చేస్తున్నాం అని చెప్పడం తో వాహనదారులు వాటి పై మక్కువ చూపిస్తున్నారు.
ఇలా చేయవద్దని, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఐఆర్‌డీఏఐ చెప్పింది. పైగా ఫేక్ వెబ్‌సైట్ల తో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. డిజిటల్ నేషనల్ మోటార్ ఇన్సూరెన్స్ పేరుతో మోసాలు జరుగుతున్నట్టు చెప్పింది. ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి మీరు నమ్మొద్దు అని చెప్పింది. ఐఆర్‌డీఏఐ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక ప్రత్యేక నెంబర్ కేటాయిస్తుంది, అలాగే ఆ కంపెనీలు జారీ చేసే పాలసీలపై కూడా యూఐడీ నెంబర్ ఉంటుందని తెలిపింది. ఆలా ఉన్నట్టయితేనే అది నిజమైన పాలసీ అని వెల్లడించింది.