ఆధార్‌ కార్డులో ఉండే క్యూఆర్‌ కోడ్‌ వల్ల ఏంటి ఉపయోగం..?

-

కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరునికి ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. భారతదేశంలోని ప్రతి పౌరునికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ద్వారా ఆధార్ కార్డు జారీ చేయబడుతుంది. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడానికి సహా దేనికైనా ఆధార్ తప్పనిసరి. ప్రాథమిక గుర్తింపు పత్రం కాబట్టి ఆధార్‌లోని సమాచారం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఎలా తనిఖీ చేయాలి? ఆధార్ కార్డుకు కుడివైపున ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆధార్ కార్డు వివరాలను తనిఖీ చేయవచ్చు. అసలు మీరు ఎప్పుడైనా ఈ క్యూఆర్‌ కోడ్‌ ఎందుకు అని ఆలోచించారా..? దానితో ఏంటి ఉపయోగం తెలుసా..? ఈరోజు తెలుసుకుందాం.

Google Play Store, Apple Store, Windows ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల కోసం UIDAI యొక్క mAadhaar యాప్ లేదా UIDAI ఆమోదించిన QR కోడ్ స్కానింగ్ యాప్‌ని ఉపయోగించి మాత్రమే ఆధార్‌లోని QR కోడ్‌ని స్కాన్ చేయవచ్చు. విండోస్ అప్లికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ “uidai.gov.in” నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.UIDAI వెబ్‌సైట్ ప్రకారం.. ఆధార్ QR కోడ్‌లలో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం మరియు ఆధార్ నంబర్‌తో సహా నివాసి వివరాలు ఉంటాయి.

M ఆధార్ యాప్ ద్వారా QR స్కాన్‌తో ఆధార్‌ని ఎలా ధృవీకరించాలి:

ముందుగా, M ఆధార్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఓపెన్‌ చేయండి.

తర్వాత QR కోడ్ స్కానర్‌ని తీసుకోండి

ఆధార్ కార్డు కాపీలన్నింటికీ క్యూఆర్ కోడ్ ఉంటుంది.

ఇప్పుడు, ఆధార్‌లోని QR కోడ్‌ని స్కాన్ చేయండి.

పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా మరియు ఫోటోతో సహా ఆధార్ హోల్డర్ సమాచారాన్ని చూడవచ్చు. ఈ వివరాలు UIDAI ద్వారా డిజిటల్ సంతకం మరియు ప్రామాణీకరించబడ్డాయి. ఫేక్‌ ఆధార్‌ కార్డు తయారు చేయిస్తే.. ఈ క్యూర్‌ కోడ్‌ ద్వారా తనిఖీ చేసినప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news