హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మంచిదే.. మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం.. కృష్ణా జలాల వివాదం పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరికొన్నాళ్లు ఉంటే మంచిదే అన్నారు. రాష్ట్రానికి తాము ఎక్కువ కృష్ణా జలాలు తీసుకొచ్చామని.. ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో చెప్పారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రంలోని విపక్షాలు అర్థం చేసుకోవాలని సూచించారు. 

రాయలసీమ జిల్లాల సిద్దం సభ ఈ నెల 18 న రాప్తాడులో నిర్వహిస్తాం. భారీగా పార్టీ క్యాడర్, నాయకులు ఈ కార్యక్రమం కు హాజరవుతారు. ఎన్నికలకు ఇది శంఖారావం.  ఇప్పటికే భీమిలి, ఏలూరు లో సభ విజయవంతంగా నిర్వహించాం. ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులకి సిఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు.  టిడిపి పతనావస్థకు చేరింది.. ఇది ప్రారంభం మాత్రమే. తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపి అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో, సీఎం వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారు.

టిడిపి ఏమి చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదు. షర్మిల టిడిపి అజెండాలో బాగంగా పని చేస్తున్నారు. అందరూ ఏకం అవుతారని మొదటి నుంచి చెబుతున్నాం. జగన్ ఎప్పుడూ సింగిల్ గానే వస్తారు. టిడిపి నమోదు చేసిన దొంగ ఓట్ల వల్ల గతంలో మేము కొన్ని సీట్లు ఓడిపోయాం. మేము ఎలాంటి ఓటర్ నమోదు లు చేయలేదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news