ఫేస్‌బుక్‌లో వాట్సప్‌ వాడచ్చు! ఎలా అంటే?

-

వాట్సాప్‌ వినియోగదారులకు మరో శుభవార్త. మీరు ఫేస్‌బుక్‌లో వాట్సాప్‌ ఉపయోగించే విధానాన్ని త్వరలో ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ యాప్‌ ద్వారా వాడచ్చు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఎఫ్‌బీ మెసెంజర్‌తో మన ఫోన్‌ మెసేజ్‌ యాప్‌లతో కలపవచ్చని తెలుపుకదా! ఈ విధంగానే వాట్సాప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ని కూడా కలిపేయవచ్చు. దీనికి అవును అనే అంటున్నారు సంబంధిన నిపుణులు. అంటే రానున్న రోజుల్లో వాట్సాప్‌ ఛాట్స్, మెసెజంర్‌లో కనబడతాయి. దీన్ని ఇదివరకే కొంత మంది బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ,ఎఫ్‌బీ, వాట్సాప్‌ను కలిపడం అనేది వినియోగదారుల ఎంపికకు ఆప్షనల్‌గా పెట్టారు. వినియోగదారుడికి యాక్సెప్ట్‌ చేస్తేనే ఇలా రెండూ ఒకదాంట్లో వస్తాయట.


‘ఇందులో మీరు వాట్సాప్‌ మెసేజ్‌లు కూడా చూడాలనుకుంటున్నారా’ అని అడుగుతుందట. దానికి వినియోగదారుడు ఓకే చెబితే… ఇంటిగ్రేషన్‌ మొదలవుతుంది. ఆ తర్వాత వాట్సాప్‌ ఛాట్స్‌ను మెసెంజర్‌లో యాక్సెస్‌ చేయవచ్చు. అలా అని వాట్సాప్‌ మెసేజ్‌లు అన్నింటినీ మెసెంజర్‌లో మూవ్‌ చేస్తోంది అనుకోనక్కర్లేదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సౌకర్యం వాట్సాప్‌లో ఉండటం వల్ల అందులోని మెసేజ్‌లు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో కనిపిస్తాయి. కాబట్టి ప్రైవసీకి వచ్చిన ఇబ్బందేం లేదు అని కూడా అంటున్నారు.
అయితే, వాట్సాప్, మెసెంజర్‌ను కలిపేస్తున్నట్లు ఇప్పటివరకు అధికారికంగా ఫేస్‌బుక్‌ నుండి ఎలాంటి సమాచారం లేదు. టెక్‌ టిప్‌స్టర్‌లు మాత్రం సీక్రెట్‌ కోడ్స్‌లో ఇది ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఇ న్‌
స్ట్రాగామ్‌ మెసెంజర్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ను కలిపి ఒకటిగా చేసింది ఫేస్‌బుక్‌. ఇప్పుడు వాట్సాప్‌ కూడా అందులోకి వెళ్లిపోతోంది అని అంటున్నారు. ఇదే జరిగితే… భవిష్యత్తులో మెసెంజర్, వాట్సాప్‌లో ఏదో ఒకటే ఉంటుంది.

వాట్సాప్‌ ప్రైవసీ మీద ఆరోపణలు వస్తున్న సమయంలో కొత్త ప్రైవసీ పాలసీని తీసుకురావడానికి వాట్సాప్‌ ఇచ్చిన గడువు (మే 15) దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి కొత్త ఫీచర్లను వాట్సాప్‌ తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version