వాట్సాప్ వాడితే ఈ మూడు అసలు మర్చిపోవద్దు…!

-

ఈ రోజుల్లో వాట్సాప్ అనేది మన జీవితంలో చాలా కీలకంగా మారిపోయిన సామాజిక మాధ్యమం. విద్య నుంచి ఉద్యోగం వరకు ప్రతీ విషయంలోనూ వాట్సాప్ అనేది కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దాని వలన ప్రయోజనాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు కూడా దాని మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. దాని మీద జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. అంతే కాదు నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పక తీసుకోవాలని సూచిస్తున్నారు. వాట్సాప్ వాడే సమయంలో పోర్న్ వీడియోలకు సంబంధించి ఏ లింక్ కూడా షేర్ చేయవద్దని సూచిస్తున్నారు. అలా చేస్తే మాత్రం ప్రత్యేక చట్టం ద్వారా మీరు జైలు పాలు అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా వాట్సాప్ లో మహిళలను ఇబ్బంది పెట్టేలా మెసేజ్ లు చేసినా మీరు కటకటాల్లోకి వెళ్లే అవకాశముంది.

ఎందుకంటే ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఈ మధ్య ఇటువంటి విషయాల్లో వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. మరొకరి పేరుతో వాట్సాప్ ఖాతాను ఓపెన్ చేయడం, వారి లాగా చాట్ చేయడం కూడా నేరమే. ఇలా చేసిన వారికి కూడా కఠిన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. నిషేధిత వస్తువుల అమ్మకాలను వాట్సాప్ ద్వారా అమ్మడం చట్టరీత్యా నేరం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news