పీఎఫ్ మొత్తాన్ని తీసుకోవాలా..?అయితే ఇలా చెయ్యండి..!

-

ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఇప్పుడు డబ్బులని తీసుకోవడం లో ఎలాంటి ఇబ్బందులు పడక్కర్లేదు. ఈజీగా స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి ఉమాంగ్ యాప్ సాయంతో డబ్బును తీసుకోచ్చు. అయితే మరి ఉమాంగ్ యాప్ ని ఉపయోగించి ఎలా డబ్బులని తీసుకోవాలి అనేది చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఈపీఎఫ్ఓ ఖాతాదారులు డబ్బులని తీసుకోవడానికి మొదట ఉమాంగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఆ తరవాత సెర్చ్ మెనూలోకి వెళ్లి, లుక్ ఫర్ ఈపీఎఫ్ఓ సర్వీసెస్‌లోకి వెళ్లాలి.
ఇక్కడ మీరు ఎంప్లాయీ సెంట్రిక్‌ను ఎంచుకోవాలి.
ఆ తరవాత రెయిజ్ క్లెయిమ్‌ను పైన క్లిక్ చేయాలి.
ఈపీఎఫ్ యూఏఎన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
ఉపసంహరణ రకాన్ని ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి.
ఉమాంగ్ యాప్ ద్వారా సబ్‌మిట్ చేయాలి.
మీకు క్లెయిమ్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.

అలానే మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కచ్చితంగా పాన్ నెంబర్‌తో లింక్ అయి ఉండాలి. అదే విధంగా మీ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉండాలి. మీ ఉమాంగ్ యాప్ కచ్చితంగా ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉండాలి. అప్పుడే డబ్బులు తీసుకోవడానికి అవుతుంది. లేదంటే కుదరదు.

 

Read more RELATED
Recommended to you

Latest news