రిస్క్ లేని ఈ  స్కీమ్ తో లక్షలు పొందొచ్చు… ఎలా అంటే…?

మీరు ఎలాంటి రిస్క్ లేకుండా మంచిగా డబ్బులు పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఒక అదిరిపోయే స్కీమ్ ఒకటి అందుబాటు లో ఉంది. దీనితో మీకు మంచి లాభం వస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే…. ఈ స్కీమ్ లో చేరాలంటే కేవలం రూ.250తో ఈ చేరొచ్చు.

అలానే నచ్చిన మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది అయ్యే సరికి  రూ.లక్షలు పొందొచ్చు. అదే సుకన్య పధకం. సుకన్య సమృద్ధి పథకంలో చేరాలని భావించే వారు పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి చేరొచ్చు. రూ.250తో పథకంలో జాయిన్ అవ్వచ్చు. ఆ తరువాత నచ్చినంత డబ్బులు పెట్టవచ్చు.

దీనిలో కనుక స్కీమ్‌ లో చేరితే కచ్చితమైన రాబడి వస్తుంది. అదే విధంగా  ఎలాంటి రిస్క్ ఉండదు. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలి. 15 ఏళ్లు డబ్బులు పెట్టాలి. ప్రస్తుతం సుకన్య సమృద్ధి స్కీమ్‌ పై 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరం లో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.

కుటుంబం లో ఇద్దరు అమ్మాయిల పేరు పై మాత్రమే సుకన్య సమృద్ధి అకౌంట్ తెరవడానికి అవుతుంది. సుకన్య సమృద్ధి స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత సుకన్య సమృద్ధి స్కీమ్ నుంచి కొంత మొత్తాన్ని విత్‌ డ్రా చేసుకోవచ్చు.