మరొకరి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ వాడుతున్నారా..? అయితే వీటిని మీరు తెలుసుకోవాలి..!

-

మీకు తెలిసిన వాళ్ళు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటే మీరు కూడా ఆ వివరాలను అడిగి వాడుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు దీనిని తెలుసుకోవాలి. ఒక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని చాలా మంది వాటిని పంచుకుంటూ వుంటారు. ఈ విషయం పై నెట్‌ఫ్లిక్స్ దృష్టి పెట్టింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఒకే ప్రదేశంలో కానీ వేర్వేరు ప్రదేశాల్లో ఒకే నెట్‌ఫ్లిక్స్ ఖాతా ఉపయోగించే వారికి యాక్సెస్ బ్లాక్ చేసే ప్రయోగం చేస్తోంది. గతేడాది ఇందుకు సంబంధించి మెసేజ్ ని కూడా పంపింది. అయితే ఒకే ప్రదేశంలో లేకుండా ఒకే నెట్‌ఫ్లిక్స్ ఖాతా ఉపయోగించే వారిని గుర్తించి యాక్సెస్ బ్లాక్ చెయ్యడానికి నెట్ ఫ్లిక్స్ అవసరమైన చర్యలను చేపడుతోంది.

ఈ టెస్టు తర్వాతి కొద్ది వారాల్లో చిలీ, కోస్టారికా, పెరూ దేశాల్లో ప్రారంభం అవ్వనుంది. పైగా వాళ్లకి బోల్ట్-ఆన్ సబ్‌స్క్రిప్షన్ అనే ఆప్షన్ ని తీసుకు రావడం జరిగింది. దీని ద్వారా ఒకే ప్రదేశం లో నివసించని వారు కూడా నెట్‌ఫ్లిక్స్ ఖాతాను పంచుకోవచ్చు.

ఒకే ప్రదేశంలో ఉండే వారికి నెట్‌ఫ్లిక్స్ వినియోగాన్ని ఈజీ చెయ్యాలని కొన్ని ఫీచర్స్ ని తీసుకు వచ్చింది. ఇందులో ప్రత్యేకమైన ప్రొఫైల్స్, మల్టీపుల్ స్ట్రీమ్స్ వంటి ప్లాన్లు కూడా వున్నాయి. స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లు కూడా ఇందులో వున్నాయి. ఇది ఇలా ఉంటే నెట్‌ఫ్లిక్స్ వినియోగదారుల్లో 33 శాతం మంది తమ పాస్‌వర్డ్‌లను బయటి వ్యక్తులతో షేర్ చేసుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news