2021 Round up : ఈ ఏడాది ఎక్కువ వ్యూస్ ఈ పాటలకే…!

-

పాటలు పాడే వాళ్ళు, పాటల్ని వినే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజానికి మ్యూజిక్ లో ఏదో ఒక అద్భుతమైన ఫీలింగ్ దాగి ఉంటుంది. మంచి పాటలు వింటే ఎంతటి చికాకు అయినా దూరమైపోతుంది. మనలో మంచి వైబ్రేషన్స్ వస్తాయి.

అలానే కొన్ని పాటలు వింటూ ఉంటే మన కోసమే రాసారేమో, మన స్థితిని ఊహించుకుని రాసారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ వ్యూస్ తో వైరల్ అయిన పాటలు ఆడియో, 2020 చివర్లో, 2021 ఆరంభంలో విడుదలైన సినిమాలు, విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు ఉన్నాయి. అయితే మరి ఆ పాటల గురించి.. హిట్ అయిన ఆ పాటలు వివరాలు గురించి చూద్దాం.

నీకళ్ళు నీలి సముద్రం :

ఉప్పెన చిత్రంలోని నీకళ్ళు నీలి సముద్రం బాగా హిట్ అయ్యింది. శ్రీమణి ఈ పాటని వ్రాసారు. నిజంగా ఈ పాట మంచి వైబ్స్ ని ఇస్తోంది. పైగా పదే పదే ఈ పాటని పడాలని, వినాలని అనిపిస్తుంది.

ఒకే ఒక లోకం :

‘ఒకే ఒక ప్రాణం నీవే’ పాట అదిరిపోయింది అనే అనాలి. శశి సినిమాలోనిది ఇది. ఈ పాటతో సంగీత దర్శకుడు వరుణ్ ఫేమస్ అయ్యాడు.

లవ్ స్టొరీ :

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలన్నీ కూడ బాగున్నాయి. ముఖ్యంగా ‘సారంగ దరియా’ బాగా హిట్ అయ్యింది. డాన్స్ కూడ పీక్స్ లో వుంది.

నీలి నీలి ఆకాశం:

”ముఫ్ఫై రోజుల్లో ప్రేమించడం ఎలా” సినిమాలోది ఈ సాంగ్. ఈ పాట కూడ పదే పదే పాడుకోవడనికి, వినడానికి కూడ బాగుంటుంది. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా చక్కగా కుదిరింది.

చిట్టి నీ నవ్వంటే:

జాతి రత్నాలు సినిమా మంచి హిట్ అందుకుంది. అలానే ‘చిట్టి నీ వవ్వంటే’ పాట తెగ సందడి చేసింది.

లేహరాయి :

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో లేహరాయి పాట కూడ ఎంతో బాగా అలరించింది. ఈ పాటని కూడ సిద్ శ్రీ రామ్ పాడాడు.

మగువా మగువా:

‘వకీల్ సాబ్’ నుంచి వచ్చిన మగువ మగువ పాట సూపర్ హిట్ అయింది. స్త్రీల గురించి వాళ్ళ యొక్క పనుల గురించి ఈ పాట లో ఎంతో చక్కగా వివరించారు. సిద్ శ్రీరామ్ వాయిస్ తో బాగా ఆకట్టుకున్నాడు.

చుక్కల చున్నీ :

ఎస్ ఆర్ కళ్యాణ మండపం నుండి వచ్చిన ఈ పాట కూడ మంచిగా హిట్ అయ్యింది. వ్యూస్ పరంగా కూడా ఈ పాట సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రేమంటే ఏంటి ?:

‘పెళ్లి సందడి’ నుంచి ‘ప్రేమంటే ఏంటి’ అనే పాట యూత్ కి నచ్చింది. ఎక్కువ వ్యూస్ కూడ ఈ పాటకి వచ్చాయి. ఈ ఏడాది హిట్ అయిన పాటల్లో ఇది కూడ ఒకటి.

పుష్ప నుంచి రెండు పాటలు:

పుష్ప ఆడియో కూడా అదిరింది అనే చెప్పాలి. సూపే బంగారం.. నా సామి పాటలు అలరించాయి. దేవిశ్రీ సుకుమార్ అల్లు అర్జున్.. ఈ ముగ్గురిది చార్ట్ బస్టర్ కాంబినేషన్. మరి ఆ మాత్రం ఉండాలి.

నాటు పాట:

ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన ‘నాటు నాటు’ పాట అందరిలోనూ హుషారు పెంచింది. ఇది కూడ ఈ ఏడాది వచ్చిన మంచి పాటల్లో ఒకటి.

లాహే లాహే :

మెగాస్టార్ చిరంజీవి ఆచార్యా ఇంకా విడుదల కాలేదు. కానీ లాహే లాహే పాటకి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి మంచిగా లిరిక్స్ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news