కబడ్డీ ఆడుతూ బొక్క బోర్లా పడ్డ స్పీకర్ తమ్మినేని.. వీడియో వైరల్ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ గురించి తెలియని వారు ఉండరు. రెండు రాష్ట్రాల్లోనూ ఆయన చాలా ఫేమస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా ఉన్నప్పటికీని.. వైసిపి నేత లాగే ప్రెస్మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు తమ్మినేని సీతారాం. అయితే తాజాగా తమ్మినేని సీతారాం కు ఊహించని పరిణామం ఎదురైంది.

స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ ఇవాళ అదుపు తప్పి కింద పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో సీఎం కప్ పేరుతో క్రీడా పోటీలు ప్రారంభించారు తమ్మినేని సీతారాం. అయితే ఈ నేపథ్యంలో ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు ప్లేయర్ గా మారిపోయారు. కబడ్డీ ఆడుతూ అక్కడున్న వారిలో హుషారు తీసుకొచ్చారు స్పీకర్. అయితే దురదృష్టవశాత్తు ఈ నేపథ్యంలోనే కాలుజారి సీట్ కింద పడిపోయారు స్పీకర్ తమ్మినేని. సీతారాం కిందపడగానే అందరూ అప్రమత్తమై వెంటనే పైకి లేపారు. ఈ ఘటనలో ఆయన ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.