ఆ విషయంలో బాగా ఎంకరేజ్ చేసేవాడు భర్తగా కావాలంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ..!

-

ప్రార్ధన ప్రతి రూపాయికి లెక్కుంటుంది అంటూ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో సందడి చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా తర్వాత వరసగా తెలుగులో స్టార్స్ సరసన నటించి సూపర్ హిట్స్ అందుకుంది. దాదాపు నాలుగేళ పాటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఆ తర్వాత కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. చెసిన సినిమాలన్ని వరసగా ఫ్లాపవుతూ రావడంతో టాలీవుడ్ లో క్రేజ్ తగ్గిపోయింది.

 

నాగార్జున సరసన నటించిన మన్మధుడు 2 కూడా తీవ్రంగా నిరాశ పరచింది. అంతే మళ్ళీ రకుల్ కి సినిమాలు రావడానికి చాలా సమయం పట్టింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక యంగ్ హీరో సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఆ సినిమాతో మళ్ళీ ఫాం లోకి వస్తా అన్న ధీమాతో ఉన్న రకుల్ సోషల్ మీడియాలో మాత్రం రెగులర్ గా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో సెలబ్రిటీస్ వరసగా పెళ్ళి కబుర్లతో చెప్తూ తమ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం లో రకుల్ కూడా రియాక్టయింది. తనకి ఎలాంటి వ్యక్తి కావాలో ఓపెన్ అయింది. మంచు లక్ష్మి కరోనా లాక్డౌన్ కారణముగా ఫన్ కోసం సెలెబ్రిటీస్‌ని సోషల్ మీడియాలో ఇంటర్వూస్ చేస్తుంది. అందులో భాగంగా లక్ష్మి మంచు రకుల్‌ని ఇంటర్వ్యూ చేసింది. రకుల్ ప్రీత్ ఈ సందర్భంగా తనకి బుద్దిమంతుడు, తెలివైనవాడు భర్తగా కావాలని తన మనసులోని మాటను బయట పెట్టింది. అంతేకాదు తన వృత్తిని ఎంకరేజ్ చేసేవాడైతే ఇంకా చాలా మంచిదని తెలిపింది. చెప్పాలంటే రకుల్ రిక్వైర్‌మెంట్ చాలా తక్కువే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news