జగన్ ది బాధ్యతారాహిత్యం..చంద్రబాబు

-

ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగిన అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధ్యత మరచి హైదరాబాద్ కి ఎందుకువెళ్లారు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ పై జరిగిన దాడిని ముమ్మాటికి ఖండిస్తున్నా… గాయం జరిగింది  కేంద్ర ప్రభుత్వ పరిధిలో గల ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిని తెదేపా ప్రభుత్వానికి ఆపాదించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. కనీసం ప్రథమ చికిత్సను సైతం చేయించుకోకుండ విశాఖ నుంచి హైదరాబాద్ కి వెళ్లడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇంటికి వెళ్లిన తర్వాత హాస్పిటల్ లో చేరడం? ఆతర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించడం వెనుక ఉన్న అసలు కథ ఏంటో త్వరలోనే తెలుసుకుంటారు అంటూ పేర్కొన్నారు. గవర్నర్ పరిధిని మరిచి నేరుగా డీజీపీకి ఫోన్ చేశారు. దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు వైసీపీ వీరాభిమానినంటూ పేర్కొని రాసిన లేఖ ఈ పరిణామాలన్నింటికి సాక్ష్యం. కేంద్ర ప్రభుత్వంతో కొంత మంది రాష్ట్ర నేతలు కలిసి లాలూచి ఒప్పందాలు కుదుర్చుకుంటే సహించేది లేదు. శాంతి భద్రతలకు ఎవరు ఉల్లంఘించిన సహించేది లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news