వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో సానుభూతి పెరగడం కోసమే దాడి చేశానని నిందితుడు జానపల్లి శ్రీనివాస రావు పేర్కొన్నారు. గత ఎన్నికల్లోనే జగన్ సీఎం కావాల్సి ఉందని.. జగన్ సీఎం కాకపోవడంతో మనస్తాపం చెందానని దీంతో జగన్‌పై దాడి చేస్తే సానుభూతి పెరుగుతుందనే ఊహించి ఇలా చేశానని శ్రీనివాస రావు చెప్పాడు. తమ కుటుంబసభ్యులందరూ వైఎస్ అభిమానులేనని చెప్పాడు.. ఇది ఇలా ఉంటే నిందితుడు శ్రీనివాస్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. అలాంటప్పుడు నిందితుడు చెప్పిన మాటలు ఎలా నమ్మగలమని ప్రశ్నిస్తున్నారు. దాడిని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఘటనపై అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తు బృందంలో ఏసీపీ నాగేశ్వరరావుతో పాటు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.