” బ్లాక్ ” తో రాబోతున్న ఆది సాయి కుమార్ …!

-

కెరీర్ బిగినింగ్ నుంచి మంచి కథ లను ఎంచుకుంటూ నెమ్మదిగా సాగుతున్న హీరో ఆది సాయికుమార్. ఈ యంగ్ హీరో హీరోగా.. ఆట‌గాడు సినిమా తో తెలుగు తెరకు ప‌రిచ‌యమైన ద‌‌ర్శ‌నాబానిక్ హీరోయిన్ గా జి.బి.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో ఒక సినిమా రూపొందుతుంది. మ‌హంకాళి మూవీస్ బ్యాన‌ర్ పై మ‌హంకాళి దివాక‌ర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి బ్లాక్ అనే టైటిల్ ని యూనిట్ క‌న‌ఫ‌ర్మ్ చేసారు. ఇక ఈ సినిమా లాక్‌డౌన్ కి ముందు షూటింగ్ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. అప్పటికే 70% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మిగ‌తా బ్యాల‌న్స్ షూటింగ్ ని లాక్‌డౌన్ త‌రువాత మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఇక ఈరోజు ఈసినిమా టైటిల్ ని కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్ ని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా నిర్మాత మ‌హంకాళి దివాక‌ర్ .. మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రానికి బ్లాక్ అనే టైటిల్ని ఖరారు చేసాము. టైటిల్ తో పాటు ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశామని తెలిపారు.

ఈ సినిమాకి ఇప్ప‌టికే అంచ‌నాలు బాగానే నెలకొన్నాయి. సక్సెస్ కోసం చూస్తున్న హీరో ఆదికి ఈ సినిమా మంచి సక్సస్ ను అందిస్తుందని ధీమాగా ఉన్నారు. అంతేకాదు ఈ ఈ సినిమా ఆది కెరీర్లోనే ఒక ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. ఆది సాయికుమార్ అభిమానుల‌, సిని ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకుంటుంద‌ని అని అన్నారు. ఇక బుర్రకథ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలతో హిట్స్ అందుకున్న సాయి కుమార్ కాస్త గ్యాప్ తీసుకొని బ్లాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news