మొదలవబోతున్న అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ ల ” ఐకాన్ “..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం పుష్ప సినిమా తెరకెక్కుతుంది. అయిదు భాషల్లో పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తో పాటు అల్లు అర్జున్ కొత్త సినిమా ఐకాన్ కూడా మొదలవబోతుందని తాజా సమాచారం. వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని తెరకెక్కిస్తున్నాడు.

 

ఈ సినిమా కంప్లీటవగానే ఐకాన్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో చేయాల్సింది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల పెండింగ్ పడింది. దాంతో ఐకాన్ సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఇటీవల దిల్ రాజు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ ఉందని కన్‌ఫర్మ్ చేస్తూ ఐకాన్ పోస్టర్ తో అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పి క్లారిటీ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తుండగా ఈ సినిమాలో ఉన్న మాస్ ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటిస్ దిశా పఠాని, ఊర్వశి రౌతెలా లలో ఒకరిని తీసుకోవాలని సుకుమార్ అనుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news