నక్షత్రం ఆకారంలో ఉన్న బొప్పాయి పండు.. స్నేహితులను మళ్లీ కలిపింది..!

-

కరోనా మహమ్మారి ఎంతో మంది బతుకులను నాశనం చేసింది. సొంత ఊరిని, కన్నవాళ్లను, కుటుంబ సభ్యులు, స్నేహితులను దూరం చేసింది. ఎట్టకేలకు ఆంక్షలను సడలిస్తుండడంతో అందరూ తమ తమ సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రత్యేకమైన ఆకారంలో ఉన్న ఓ బొప్పాయి పండు వల్ల తన స్నేహితులను మళ్లీ కలుసుకున్నాడు.

star shaped papaya united this man and his lost friends

కమల్‌జిత్‌ సింగ్‌ అనే ఓ వ్యక్తి తాజాగా బొప్పాయి పండ్లను కొన్నాడు. వాటిలో నక్షత్ర ఆకారంలో ఉన్న ఓ బొప్పాయి పండు వచ్చింది. నిజానికి ఆ పండు అలాంటి ఆకారంలో ఉండగా చూడడం.. దాదాపుగా అందరికీ ఇదే మొదటిసారి. దీంతో కమల్‌జిత్‌ కూడా ఆ పండును ఫొటో తీసి తన సోషల్‌ ఖాతాలు అన్నింటిలోనూ ఆ ఫొటోలను షేర్‌ చేశాడు.

అలా అతను షేర్‌ చేసిన ఫొటోలను చూసిన పాత స్నేహితులు అతనికి మళ్లీ దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆ బొప్పాయి పండు తనతో తన స్నేహితులను అలా కలిపినందుకు ఎంతో సంతోషంగా ఉందని అతను అంటున్నాడు..!

Read more RELATED
Recommended to you

Latest news