సరదాకి: మహానాడులో జేసీ ప్రసంగించి ఉంటే…!

-

ఏ పార్టీలో ఉన్నామన్నది కాదన్నయ్యా… విమర్శలు పడ్డాయా లేదా… అనిపించింది, అనుకున్నది డైరెక్టుగా చెప్పామా లేదా అన్నట్లుగా సాగుతుంటుంది జేసీ దివాకర్ రెడ్డి రాజకీయ వ్యవహారం! కాకపోతే గతంలో వైఎస్సార్ లాంటి వారి వద్ద పనిచేసినప్పుడు.. పార్టీ వదిలేశాక మాత్రమే ఆ పార్టీపై విమర్శలు చేసిన జేసీ… టీడీపీలో చేరిన తర్వాత మాత్రం నేరుగా బాబుముందే, బాబుపైనే విమర్శలు చేసేయడం మొదలుపెట్టారు! ఇది జేసీ విభిన్న శైలి అని చెప్పేవారు కొందరంటే… బాబు బలహీతనలు ఆయనకు తెలుసులే అని మరికొందరంటే… అధినేతముందు అలా మాట్లాడటానికి గట్స్ ఉండాలిరా భయ్ అనే వారు ఇంకొందరు! ఈ క్రమంలో… మంగళగిరి వేదికగా, ఆన్ లైన్ వేడుకగా జరిగిన మహానాడు లో జేసీ దివాకర్ రెడ్డి పాల్గొని, ప్రసంగించి ఉంటే ఎలా ఉంటుంది?

ఆన్ లైన్ వేదికగా రెండు రోజుల పాటు “ఆత్మ స్తుతి పరనింద” పద్దతిలో సాగిన మహానాడులో అంత మాస్ అట్రాక్షన్ సంఘటనలు ఏమీ లేవు. అటు రాజకీయంగా పార్టీకి ఉపయోగపడే అంశాలు చర్చకు రాలేదు.. ఇటు మీడియాకు ఫుల్ మీల్స్ దొరికే సంఘటనలూ జరగలేదు! ఏదో చినరాజప్ప – జ్యోతుల నెహ్రూలు… జేసీ దివాకర్ రెడ్డి లేని లోటు కాస్త తీర్చే ప్రయత్నం చేసినా… అది వారి జిల్లా గొడవ, అది వారి వ్యక్తిగత గొడవగా మారిపోయింది తప్ప మరీ మాస్ అట్రాక్షన్ గా అయితే నిలవలేదు! ఈ క్రమంలో ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితులపైనా.. బాబు చేస్తున్న ఆన్ లైన్ రాజకీయాలపైనా జేసీ ఎలా స్పందించి ఉండేవారు అనే చర్చలు ఆన్ లైన్ వేదికగా జరగడం స్టార్ట్ అయ్యాయి.

పెరిగిన విద్యుత దరలకు నిరసనగా… ఎవరి ఇంట్లో వారు కూర్చుని దీక్ష చేయాలని బాబు, టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇది ఎంతవరకూ సరైన చర్యో ప్రత్యేకంగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంపై మీడియా ముందే బహిరంగంగా బాబుపై సెటైర్లు వేసిన జేసీ… మహానాడు వేదికగా మైక్ దొరికితే మాత్రం ఫైరయ్యేవారని అంటున్నారు. “ఏమయ్యా లోకేష్ బాబు, ఏవండీ చంద్రబాబు…ఇదెక్కడి రాజకీయమయ్యా, అబ్బే నేను మునుపెన్నడూ చూడలేదు. బహిరంగంగా నిరాహారదీక్ష చేస్తేనే నమ్మే దిక్కులేని ఈ రోజుల్లో… ఇంట్లో కూర్చుని దీక్ష అంటే ఎవరు పట్టించుకుంటారయ్యా” అని మొదలుపెట్టేవారంట!

సాధారణంగా సెల్ఫ్ అనాలసిస్ చేసుకోవడానికి, భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేసుకోవాడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన మహానాడులో… మొత్తం జగన్ ను తిట్టడానికి మాత్రమే సమయం కేటాయించడంపై…. “175 సీట్లకు 23 ఎందుకొచ్చాయి.. అందులో ఎవరి పాత్ర ఎంత అనే విషయాలు చర్చించి, తప్పులు సరిదిద్దుకునే పనులు మానేసి, మొత్తం మావాడిమీద పడ్డారేంటయ్యా.. మొత్తం మావాడి పబ్లిసిటీ కోసమే మహానాడు పెట్టినట్లున్నారు” అనేవారంట!

ఇక టీడీపీ బాధ్యతలు లోకేష్ కు అప్పగించాలనే తీర్మానం గనక చేసి ఉంటే…. “చంద్రబాబూ 70ఏళ్లు దాటినంత మాత్రాన్న ఏమీకాదు లేవయ్యా… అయినా ఈ సమయంలో ఇదేమి నిర్ణయమయ్యా సామి… చినబాబుకు అప్పుడే అంత బాధ్యత నెత్తిమీద పెట్టి, నువ్వు ఎంజాయ్ చేద్దామనుకుంటున్నావా? మనం బ్రతికుండగా అంత రిస్క్ వద్దులేవయ్యా… చినబాబు చిన్నపిల్లోడు..” అనేవారంట! ఈ రకంగా జేసీ లేని లోటుపై ఆయన అభిమానులు ఆన్ లైన్ వేదికగా ఊగాగాణాలు చేస్తూ తృప్తి పడుతున్నారంట!

Read more RELATED
Recommended to you

Latest news