ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా గవర్నర్ వ్యవహార శైలిపై గళమెత్తనున్నారు. దీంతో శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, గవర్నర్ తీరు తదితర అంశాల మీద జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉన్న జాతీయ స్థాయి నేతలకు కలవనున్న చంద్రబాబు కేంద్ర వ్యవహారశైలి రాష్ట్రంలో జరుగుతున్న తెదేపా నేతల పై కేంద్ర అధికారుల దాడులను వివరించనున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై హత్యాయత్నం కేసుకు సంబంధించి గవర్నర్ సరైన పద్ధతిని అనుసరించక పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.