కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

-

ఢిల్లీలో ఉన్న మంత్రులు నెలలో 27 రోజులు గల్లీలో ఉంటున్నారు. కానీ కిషన్ రెడ్డి ఎప్పుడు గల్లీలో ఉంటున్నారు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి ఒక్కసారి నల్గొండ జిల్లాలో ఒక గ్రామంలో నిద్ర చేసి రండి. కిషన్ రెడ్డి అక్కడ నిద్ర చేసి కాళ్ళు, చేతులతో క్షేమంగా వచ్చే అవకాశం ఉంటదా అన్నారు కోమటిరెడ్డి. కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లోజ్ లు వేసుకుని ఇంట్లో పండుకున్నారు కేంద్ర మంత్రులు.

కిషన్ రెడ్డి సింగరేణి మీద ఒక్కసారి రివ్యూ చేయలేదు.. బండి సంజయ్ మణిపూర్ అల్లర్ల పై రివ్యూ చేశారా అని ప్రశ్నించారు. అలాగే కిషన్ రెడ్డి వేల కోట్ల బడ్జెట్ ఉండే శాఖకు మంత్రి.. ఆ శాఖకు రాజీనామా చేసి హైదరాబాద్ లో ఉండాలి. మూసీ సుందరికరణను బీజీపీ, బీఆర్ఎస్ కలిసి అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ లో రేపిస్టులని పెట్టుకున్నట్లు కేటీఆర్ ఒప్పుకున్నారు. అలాంటి వారిని పార్టీలో పెట్టుకున్నందుకు దండం పెట్టాలి. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. నల్గొండ ప్రజలు ఎటు పోయిన పర్వాలేదు అని చెబితే మా సీఎం దగ్గరకు వెళ్లి మూసీ జోలికి వెళ్ళొద్దని చెబుతా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news