తమిళనాడులో కరోనా తీవ్రత ఏ మాత్రం కూడా ఆగే పరిస్థితి కనపడటం లేదు. అక్కడ రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుంది గాని తగ్గే అవకాశాలు ఏ మాత్రం కూడా కనపడటం లేదు అనే చెప్పాలి. కరోనా కట్టడి విషయంలో తమిళనాడు ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నా సరే కరోనా మాత్రం ఆగే అవకాశాలు సూచనలు ఏ విధంగా చూసినా సరే లేవు అనే చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే…
ఇప్పుడు చెన్నై పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. బండి మీద ఒకరి కంటే ఎక్కువ మంది వెళ్తే మాత్రం ఇక ఊరుకోవద్దు అని నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తుంది. బైకులు, స్కూటర్లపై ఇద్దరు ప్రయాణిస్తే రూ.500 జరిమానా విధించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త ఉత్తర్వులు అమలులోకి తక్షణమే అమలులోకి వచ్చినట్టు చెన్నై ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో ఐదో విడత లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనితో వాహనాలపై వెళ్లేవారి సంఖ్యను బాగా తగ్గించేందుకు గానూ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. పనులు ఉంటాయని అత్యవసరంగా వెళ్ళాల్సి వస్తుంది అని అప్పుడు ఎందుకు వసూలు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు.