టిక్‌టాక్‌ స్టార్‌.. ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుతో కొట్టింది.. వైరల్‌ వీడియో..

-

హర్యానాకు చెందిన టిక్‌టాక్‌ స్టార్‌, బీజేపీ నాయకురాలు సొనాలి ఫొగట్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. అందరూ చూస్తుండగానే ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆమె చెప్పుతో కొట్టారు. దీంతో ఆ సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

tiktok star sonali phogat attacked government official with sandal

హర్యానాలోని హైసార్‌ ప్రాంతంలో ఉన్న బల్సామండ్‌ మార్కెట్‌ యార్డును శుక్రవారం ఆమె సందర్శించారు. రైతులిచ్చిన ఓ జాబితాతో ఆమె మార్కెట్‌ అధికారి సుల్తాన్‌ సింగ్‌ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఆయన అభ్యంతరకర మాటలు మాట్లాడాడని ఆరోపిస్తూ ఆమె ఒక్కసారిగా చెప్పు తీసుకుని ఆయన్ను కొట్టింది. అయితే రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన ఓ వైపు చెబుతున్నా.. ఆమె పట్టించుకోకుండా చెప్పుతో పదే పదే కొట్టింది. దీంతోపాటు ఆమె సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసింది.

అయితే సుల్తాన్‌ సింగ్‌ క్షమాపణలు చెప్పారు. దీంతో ఆమె కేసు విత్‌డ్రా చేసుకుంది. కాగా సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతుండడంతో అటు కాంగ్రెస్‌ నేతలు దీనిపై స్పందిస్తూ.. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news