తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అఖిల ప్రియ తనకు రాజకీయం నేర్పిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన అయన సంచలన వ్యాఖ్యలు చేసారు. అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి పై బాంబులు వేసినా సరే తీసుకుని వెళ్లి నామినేషన్ వేయించాను అని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తనను చంపడానికి అఖిల ప్రియ దంపతులు కుట్ర చేసారని ఆయన ఆరోపించారు. పోలీసులు చెప్పే వరకు తన హత్యకు కుట్ర జరుగుతుంది అని తనకు తెలియదు అని ఆయన అన్నారు. పోలీసులు తన హత్యకు సంబంధించిన అనేక విషయాలను చెప్తుంటే తాను షాక్ అయ్యాను అన్నారు ఆయన. పోలీసులకు తాను ఇప్పటి వరకు ఏ ఫిర్యాదు చేయలేదు అని స్పష్టం చేసారు. అఖిల ప్రియ ముద్దాయా..? కాదా అనేది ఇప్పుడు ప్రశ్న అని ఆయన వ్యాఖ్యానించారు.
తన మీద మీద దాడి జరిగినా సరే రెండు నెలల పాటు సైలెంట్ గా ఉన్నాను అని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. తన ఆరోపణలకు స్పందించకుండా అఖిల ప్రియ ఆళ్లగడ్డ రమ్మని పిలుస్తుందని ఆయన ఆరోపించారు. అఖిల ప్రియ భర్తతో కలిసి తనను చంపాలి అని సుపారి ఇచ్చింది అంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు.