కరోనా భయంతో బంకర్లలో దాక్కుంటున్న బిలియనీర్స్

-

కరోనా వైరస్ తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎవరికి వారుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కూడా కరోనా మీద యెనలేని పోరాటం చేస్తున్నారు. కాని అది ఇప్పట్లో మాత్రం ప్రపంచాన్ని వదిలే అవకాశం మాత్రం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా కట్టడి సాధ్యం కాదని తెలుస్తుంది.

ఇక ఇప్పుడు చాలా మంది ప్రజలు తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి ఏర్పడింది. మన దేశంతో పాటుగా చాలా దేశాల్లో ఇప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి గానూ ఎవరి వంతుగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు డబ్బు ఉన్న వారు అందరూ కూడా బంకర్లలో దాక్కోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కరోనా భయంతో ప్రపంచంలోని అనేకమంది బిలియనీర్లు బంకర్లలో బతకడానికి రెడీ అవుతున్నారు.

బంకర్లు అనగానే చీకటి గుహల్లా ఉండే భూగర్భ బిలాలు అనుకోవద్దు అండి బాబూ అవి అన్ని కూడా రిచ్ బంకర్లు న్యూజిల్యాండ్‌ ఓ సరికొత్త ఆలోచనతో ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. భూగర్భ బంకర్లు. బెడ్ రూంలు, లగ్జరీ హాల్స్, జిమ్, స్విమ్మింగ్ ఫూల్, ఇలా ఎన్నో సౌకర్యాలు భూమి లోపల బంకర్లను ఏర్పాటు చేస్తుంది. సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు గాని డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం అందులో ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news