ఆదాయం కోసం హైదరాబాద్ ని టార్గెట్ చేసిన కేంద్రం

-

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో చాలా వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైకి చెప్పలేని విధంగా ఆర్ధిక కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది అని చెప్పవచ్చు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత దెబ్బకు ఆర్ధిక పరిస్థితి అదే స్థాయిలో ఉంది. దీనితో ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. కీలక నగరాల నుంచి కూడా ఆదాయం రావడం లేదు కేంద్రానికి.

దీనితో ఇప్పుడు కేంద్రం కొన్ని కొన్ని నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలు చేసే సూచనలు ఉన్నాయి అని, అంటున్నారు. హైదరాబాద్ మీద ఎప్పటి నుంచో కేంద్రానికి కన్ను ఉన్న సంగతి తెలిసిందే. దానితో పాటుగా ఆదాయం వచ్చే రాష్ట్రాల మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ ని ఎలా అయినా సరే కేంద్రం పరిధిలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం కూడా బాగా లేదు కాబట్టి ఆ విషయంలో దూకుడుగా ఆలోచిస్తుంది కేంద్రం అని అంటున్నారు. మరి ఈ విషయంలో అధికార తెరాస పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది కేంద్రానికి ఏ విధంగా అడ్డు కట్ట వేస్తుంది అనేది చూడాలి. ఇక ముంబై మీద కూడా కేంద్రం దృష్టి పడింది. అలాగే విశాఖను కూడా కేంద్రం ఫోకస్ చేసినట్టు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news