హెలికాప్టర్లు డ్రోన్లతో భారత్ ని రెచ్చగొడుతున్న చైనా

-

చైనా భారత్ సరిహద్దుల్లో భారత సైన్యాన్ని చైనా టార్గెట్ చేసిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చైనా నుంచి వస్తున్న డ్రోన్ లు అదే విధంగా కొన్ని హెలికాప్టర్ లు ఇప్పుడు భారత బలగాలను ఎక్కువగా గమనిస్తున్నాయని ఎక్కడ బలగాలు ఉండవు అనే దాని మీద ప్రత్యేకంగా నిఘా పెట్టారు అని వార్తలు వస్తున్నాయి. సైనికుల కదలికలను లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా డ్రోన్ లు తిరుగుతున్నాయి అని సమాచారం.

దీనిపై ఇప్పటికే భారత ఉన్నతాధికారులు రక్షణ శాఖకు సమాచారం కూడా ఇచ్చినట్టు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ అసోం సహా మేఘాలయ వంటి ప్రాంతాల్లో ఇప్పుడు చైనా నుంచి ఎక్కువగా డ్రోన్ లు వస్తున్నాయని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇటీవల చర్చలతో సమస్యలను పరిష్కరించుకుందాం అని చెప్పిన చైనా అధికారులు ఇప్పుడు మాత్రం చెయ్యాల్సింది చేస్తున్నారు అని అంటున్నారు.

దీనిపై ఇప్పుడు కేంద్రం ఆగ్రహంగా ఉంది. త్వరలోనే భారత్ మరోసారి ఆధారాలతో సహా ప్రపంచం ముందు చైనా చేస్తున్న వ్యవహారాలను పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారత్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం కేంద్రాన్ని మరింతగా ఇబ్బంది పెడుతుంది. చైనా హెలికాప్టర్ల కు సంబంధించిన వీడియో లను భారత వాయిసేన ఇప్పటికే రికార్డ్ కూడా చేసినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news