అందరూ అనుకుంటున్నది వేరే .. బాలయ్య కి బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్ ..!

-

నట సింహం నందమూరి బాలకృష్ణ ఈరోజు తన 60 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా బాలకృష్ణ కి పుట్టిన రోజు శుభాకాక్షలు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలున్నాయని సోషల్ మీడియాలో రక రకాలుగా వార్తలు వచ్చాయి. వాటికి ఈ సీనియర్ స్టార్ హీరోలు చెక్ పెట్టారు. “60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను”… అంటూ మెగాస్టార్ టీట్ చేశారు.

 

ఈ ట్వీట్ తో అటు నందమూరి అభిమానులు ఇటు మెగా అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక బాబాయ్ బర్త్ డే సంసర్భంగా అబ్బాయ్ లు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, నందమూరి కళ్యాణ్ రాం బర్త్ డే విషేస్ ని టిట్టర్ వేదికగా తెలియజేశారు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈరోజు బాలయ్య షష్ఠి పూర్తి ఘనంగా జరగబోతుంది. ఈ వేడుక కి కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరవుతున్నారని తెలుస్తుంది. ఈ వేడుకలో తారక్ ప్రత్యేక ఆకర్షణ గా నిలవబోతున్నాడని తెలుస్తుంది. అంతేకాదు మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. బాలయ్య షష్ఠి పూర్తి కి మెగాస్టార్ ని ఆహ్వానించారా అని ..ఒకవేళ ఆహ్వానిస్తే మెగాస్టార్ హాజరవుతారా అంటూ పలువురు అభిమానులు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news