హెచ్ఎండీ గ్లోబల్.. నోకియా 5310 పేరిట ఓ నూతన ఫీచర్ ఫోన్‌ను భారత్‌లో మంగళవారం విడుదల చేసింది. ఇందులో ఎంపీ3 ప్లేయర్, మైక్రో ఎస్డీ కార్డు వేసుకునే స్లాట్, ఎఫ్ఎం రేడియో, ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
నోకియా 5310 స్పెసిఫికేషన్లు…
* 2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఎంటీ6260ఏ ప్రాసెసర్, 8ఎంబీ ర్యామ్, 16 ఎంబీ స్టోరేజ్
* 32 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
* సిరీస్ 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్, వీజీఏ బ్యాక్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
* వైర్లెస్ ఎఫ్ఎం రేడియో, డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు
* 2జి, బ్లూటూత్ 3.9, మైక్రో యూఎస్బీ
* 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, 22 రోజుల వరకు బ్యాటరీ స్టాండ్ బై
నోకియా 5310 మొబైల్ ఫోన్ వైట్ విత్ రెడ్, బ్లాక్ విత్ రెడ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. రూ.3,999 ధరకు ఈ ఫోన్‌ను అమెజాన్‌లో జూన్ 23 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇందుకు గాను ప్రీ బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించారు.