క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం రాసి పెట్టి ఉంటే ఎవరూ కాపాడలేరు కదా ..?

-

ఎం ఎస్ ధోని సినిమాతో సౌత్ మొత్తం మంచి పేరు తెచ్చుకున్నాడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి అండదండలు లేకుండా ఎదిగిన ఈ యంగ్ హీరో అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరో అనిపించుకున్నాడు. నచ్చిన కథ లని ఎంచుకుంటూ గురువు అనే వాళ్ళు లేకుండా బాలీవుడ్ లో హీరోలకి మంచి పోటీ ఇచ్చాడు. చెప్పాలంటే సుషాంత్ ఇప్పుడు బాలీవుడ్ లో మంచి మార్కెట్ సాధించుకున్న హీరో. యూత్ లో అలాగే మేకర్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో.

 

అలాంటిది గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో నలిగిపోయాడు. తన చుట్టు నెలకొన్న పరిస్థితులు తట్టుకున్నంత వరకు తట్టుకొని ఇక తట్టుకోలేనన్న క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నాడు. సుషాంత్ సింగ్ మరణం ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు తెలుగు ఇండస్ట్రీతో పాటు సౌత్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో మంది సినిమా సెలబ్రిటీస్ షాక్ కి గురయ్యారు. ఇక సుషాంత్ మరణించాక రక రకాల వార్తలు వస్తున్నప్పటికి అందులో వాస్తవం ఎంత ఉందన్నది ఏ ఒక్కరు ఖచ్చితంగా చెప్పలేరన్నది పచ్చి నిజం.

 

అయితే ఈ సంఘటనతో కలత చెందిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఎమోషనల్ గా కొన్ని కామెంట్స్ చేశారు. సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతీ ఒక్కరికి కష్టాలున్నాయి. కొంత మందికి మానసిన ఒత్తిడి ఎక్కువవుతుంటుంది. ఇలాంటి సందర్భాలలో ఒత్తిడికి లోవవుతున్న వాళ్ళకి బాగా దగ్గరిగా ఉండే వాళ్ళు అన్ని విషయాలు పచుకునే వాళ్ళు పక్కనే ఉంటే చాలా రిలీఫ్ గా ఉంటుందని అలాంటి వాళ్ళు లేక… ఉన్న వాళ్ళు ధైర్యం చెప్పక పోవడం తోనే సుషాంత్ లాంటి వాళ్ళు ఆవేశంలో ఆత్మ హత్య చేసుకుంటున్నారని అభిప్రాయపడింది. అయితే అనుష్క మాటలు సమర్ధిస్తూనే ఇలాంటివి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు .. రాసి పెట్టి ఉంటే ఎవరూ కాపాడలేరు కదా ..అని అంటున్నారట. ఇదీ నిజమే కదా..మనం ఎంత ప్రయత్నించినా చివరకి రాసి పెట్టిందే జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news