దేశంలో కరోనా రోజురోజుకి తీవ్రంగా మారుతుంది. కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగిపోయున్నాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అలాగే తెలంగాణలో కూడా కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 269 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 214 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా 151 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 5,675 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,071 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,412 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా ఒక మరణం సంభవించగా, కరోనా మృతుల సంఖ్య 192కి పెరిగింది.
తెలంగాణలో ఇవాళ ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..
-