పసిడి ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం ధర కంటే వెండి ధర మరింత పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 పెరుగుదలతో రూ.49,710కు చేరింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.500 పెరిగింది. దీంతో ధర రూ.48,050కు పరుగులు పెట్టింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర నిలకడగానే కొనసాగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 వద్ద నిలకడగా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.500 పెరిగింది. రూ.48,050కు ఎగసింది.