మరికొంతసేపటిలో ఆకాశంలో అద్భుతం కనువిందు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం చోటుచేసుకోనుంది. సూర్యుడి చుట్టూ ఓ రింగ్ ఆకారంలో గ్రహణం కనిపించడం మూలానా ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలూస్తారు, సూర్యుడిని దాదాపుగా 70 శాతం వరకు గ్రహణం కమ్ముకోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రుడు భూమికి సుదూర ప్రాంతంలో ఉండటం మూలానా సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పిఉంచలేదు. ఈ సూర్యగ్రహణం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకోబోతుంది.
ఈ సూర్యగ్రహణం విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 గంటల ప్రాంతంలో మొదలుకానుంది. ఇక భారత్ విషయానికొస్తే.. ఈ సూర్య గ్రహణం గుజరాత్‌లోని భుజ్‌లో మొదట కనిపిస్తుందని, అస్సాంలోని దిబ్రూగఢ్‌లో చివరిగా మధ్యాహ్నం 2:29 గంటలకు పూర్తవుతుందని నెహ్రూ ప్లానెటోరియంలోని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం కమ్మెయబోతుంది. ఈ గ్రహణం వల్లా కొన్ని విపత్కర పరిస్థితులు తలెత్తబోతున్నాయని అర్చక నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఈ గ్రహణం కారణంగా కొన్ని మంచి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయని గ్రహణం నుండి వెలుబడే కిరణాల ద్వారా కరోనా వైరస్ 0.01 శాతం హరింపబడుతుందని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. సూర్య గ్రహణాన్ని వీక్షించాలనుకునే వారిని గ్లాసస్ ధరించి వీక్షించాలని లేదా రెటీనా దెబ్బతినే ఆస్కారాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.