ఓటీటీలో నే సినిమాలు రిలీజ్ చేయాల్సి వస్తే సినిమాలు తీయడం మానేస్తానన్న శంకర్ ..?

-

ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా నిరూపించిన గొప్ప దర్శకుడు శంకర్. సామాజిక అంశాన్ని కథా వస్తువు గా తీసుకు భారీ కమర్షియల్ హంగులతో సినిమాని తెరకెక్కించగల ఒకే ఒక్క దర్శకుడు. ఆయన తీసిన సినిమాలు తక్కేవే అయినా శంకర్ అంటే భారత దేశం లో గొప్ప సినిమాలు తీశాడన్న ఖ్యాతిని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ తెరకెక్కిస్తున్నాడు. రోబో2 తర్వాత శంకర్ నుంచి వస్తున్న సినిమా ఇదే.

 

‘ఇండియన్’ కి సీక్వెల్ గా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాష్ కరణ్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల చేయాలని అనుకున్నప్పటికి సినిమా ఇండస్ట్రీలలో నెలకొన్న పరిస్థితుల కారణంగా 2022 వరకు పోస్ట్ పోన్ అయింది.

ఇక తాజాగా శంకర్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. దేశం మొత్తం కరోనాతో ఏర్పడిన పరిస్థితుల వల్ల దాదాపు రెండు మూడు నెలలుగా థియేటర్స్ మూత పడే ఉన్నాయి. ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను డైరెక్టుగా ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా శంకర్ థియేటర్ లో సినిమా చూసిన ఆనందాన్ని ఓటీటీ ఇవ్వలేదని.. భవిష్యత్తు ఓటీటీదే అయితే నేను సినిమాలు తీయడం కష్టం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే శంకర్ ఇలా వ్యాఖ్యలు చేయడం వెనకున్న అసలు కారణం తన సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ఉండటమే. అటువంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తే ఉపయోగం ఉండదు కదా..!

Read more RELATED
Recommended to you

Latest news