తెలంగాణ ఐపీఎస్ అధికారి టీఎస్‌పీఏ డైరెక్టర్ వీకే సింగ్ ముందస్తు రిటైర్ మెంట్ తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. లేఖలో తాను తెలంగాణ ప్రభుత్వం పై ప్రభుత్వం లో తన బాధ్యతలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా తనకి రిటైర్ అయ్యే అవకాశాన్ని కల్పించమని ఆయన అమిత్ షా ను కోరారు. ఈ ఏడాది నవంబర్ వరకు తన పదవికాలం ఉన్నప్పటికి ముందస్తు రిటైర్ మెంట్ కోరడం గమనార్హం..!
లేఖ లో ఆయన రాస్తూ.. ‘1987 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన నేను పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న సత్సంకల్పంతో చేరాను. కానీ, నా ఆశలు అడియాశలు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం నా సేవల మీద పెద్ద సంతృప్తిగా లేదు. వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వానికి భారం కాకూడదని నిర్ణయించుకున్నా. ప్రభుత్వం మీద కూడా పనికిమాలిన వారి భారం పడకూడదు. నా సేవలు ప్రభుత్వం బయట బాగా అవసరం అవుతాయని నా ఫీలింగ్. ప్రజల్లో సంస్కరణలు తీసుకురావాలి. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. కాబట్టి, అక్టోబర్ 2, 2020న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ముందస్తు రిటైర్మెంట్ పొందేందుకు అవకాశం కల్పించండి. అంటూ ఆయన లేఖ లో కోరారు.