గత 20 రోజులుగా కాశ్మీర్ లో ఉగ్రవాదుల మద్య ఆర్మీ జవాన్ల మధ్య హోరాహోరీగా కాల్పులు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం కాశ్మీర్ లోని సోపేరి ప్రాంతంలో మరోసారి ఇటువంటి ఆపత్కర ఘటన సంభవించింది. జవాన్లకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో 2 లేదా 3 ఉగ్రవాదులూ హతం అయినట్టుగా సమాచారం. జూన్ 23 న పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆర్మీ జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి, కాగా 2 ఉగ్రవాదులు ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతిచందారు. ఇక ఇదే నేపద్యంలో ఇవాళ ఉదయం సోపేరి ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు అనే సమాచారం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు వారి పై దాడి చేసేందుకు పకడ్బంధి ప్లాన్ వేశారు. భారత సైన్యానికి చెందిన 22 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి వారిని గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి కాగా ఈ కాల్పుల్లో ఇద్దరు లేదా 3 ఉగ్రవాదులు మరణించవచ్చని ఆర్మీ జవాన్లు అంచనా వేస్తున్నారు. అక్కడనుండి తప్పించుకున్న ఉగ్రవాదుల గురించి గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
కాశ్మీర్ లో జవాన్ల పై కాల్పులు…! ఎంకౌంటర్ లో 2 ఉగ్రవాదుల హతం..!
-