భారత్ చైనా వార్ : భారత్ కు అండగా అమెరికా సైన్యం..! ఇక చైనా కథ కంచికే..!

-

trump decides to send military forces to india in facing china armed forces
trump decides to send military forces to india in facing china armed forces

ప్రపంచ అగ్రదేశం.. భారత్ కు మిత్రదేశమైన అమెరికా తమ దేశంతో పాటే ఇతర దేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తుంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపద్యంలో అమెరికా హుందాగా వ్యవహరిస్తుంది, భారత్ కు అండగా నిలిచేందుకు బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది. జెర్మనీలోని తమ దేశ సైనిక బలగాలను అమెరికా భారత్ కు పంపనుంది. అమెరికా ఇంటెలిజన్స్ నిఘా ప్రకారం భారత్ తో పాటు పూర్తి దక్షిణాసియా దేశాలకు చైనాతో ప్రమాదం పొంచి ఉందని అమెరికా భావిస్తుంది. ఈ క్రమంలో చైనా ను ఎదుర్కునేందుకు అమెరికా తన దేశ సైనిక బలగాలను భారత్ కు తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. బ్రస్సెల్ ఫోరం వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో జర్మనీలో అమెరికా సాయుధ బలగాలను ఎందుకు తగ్గిస్తున్నారన్న ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు. చైనా సైనిక చర్యలు భారత్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పైన్స్ దేశాలకూ ముప్పుగా పరిణమించాయి. దక్షిణ చైనా సముద్రంలో కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కోవడానికి, చైనా ఆర్మీకి ధీటైన జవాబు ఇవ్వడానికి అమెరికా బలగాలను సరైన రీతిలో మోహరిస్తామని చెప్పారు. అవసరమైన వనరులన్నింటినీ వినియోగిస్తాం అంటూ చైనా కు హెచ్చరికలు జారీ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news