తెలుగు వారి శాసన సౌధం.. హైదరాబాద్‌లోని ఉమ్మడి రాష్ట్ర సచివాలయం.. త్వరలోనే నేలకూలనుంది. దీనిని కూల్చి వేసేందుకు తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి అనుకూలం గా తీర్పు చెప్పింది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉమ్మడి రాష్ట్ర సచివాలయం త్వరలోనే మట్టిలో కలిసిపోనుంది. ఈ సచివాలయం ఓ కట్టడం కాదు.. ఓ చారిత్రక చిహ్నం అంటారు దీని గురించి తెలిసిన వారు. నిజాం ప్రభుత్వంలో కీలక కట్టడంగా ఉన్న దీనిని తర్వాత కాలం లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సచివాలయం ఏర్పాటు చేసింది.
ఎందరో మేధావులైన ముఖ్యమంత్రులు ఈ కట్టడం నుంచే కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 10 బ్లాకు లుగా ఉన్న ఉమ్మడి రాష్ట్ర సచివాలయానికి చాలా చరిత్రే ఉంది. 1951లో ఓల్డ్ నిజాం పాలకుడు.. తెలంగా ణ సంస్కృతి, వారసత్వానికి ప్రతిబింబంగా ఈ కట్టడాన్ని నిర్మించారు. మూసీ నదికి సమీపంలో.. విశాల మైన ఆవరణలో దీనిని నిర్మించారు. మొత్తం 25 ఎకరాలకు పైగా స్థలాన్ని దీనికి కేటాయించారు. అయితే, 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్(తెలంగాణలోని జిల్లాలను కలుపుకొని)కు హైదరాబాద్‌ను రాజధానిగా ఎం పిక చేశారు. దీంతో ప్రభుత్వ శాఖలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేసేందుకు అవసరమైన పెద్ద నిర్మాణం కోసం జరిగిన అన్వేషణలో నిజాం ప్రభువు నిర్మించిన ఈ కట్టడాన్ని తీసుకుని ఆధునీకరించారు.
అప్పటి నుంచి రెండేళ్ల కిందటి వరకు కూడా ఇదే సెక్రటేరియట్‌గా కొనసాగుతూ వచ్చింది. వాస్తవానికి రా ష్ట్ర విభజన తర్వాత.. ఏపీ, తెలంగాణలకు జనాభా విభజన జరిగినట్టే.. సచివాలయ విభజన కూడా జరి గింది. ఏపీ, తెలంగాణలకు 58:42 నిష్పత్తిలో ఈ భవనాన్ని కూడా విభజించారు. రెండు రాష్ట్రాలకు హైద రాబాద్ ఉమ్మడిరాజధానిగా 2024 వరకు కొనసాగనున్న నేపథ్యంలో అప్పటి వరకు సచివాలయాన్ని కూడా కొనసాగించాలని నిర్ణయించారు. అయితే, చంద్రబాబు హయాంలో ఏపీ ప్రబుత్వం ఏపీకి తరలి వచ్చేసిం ది. దీంతో ఏపీకి కేటాయించిన సచివాలయాన్ని వినియోగించడం మానేశారు. ఇక, తెలంగాణ సీఎం కేసీ ఆర్.. సచివాలయం వాస్తు బాగోలేదని పేర్కొంటూ.. దీనిని కూల్చేస్తామని ప్రకటించారు.
అదేసమయంలో అత్యంత అధునాతన వసతులతో .. కొత్త సచివాలయ్యాన్ని నిర్మిస్తామని రెండేళ్లు కేసీఆర్ చెబుతన్నారు. అయితే, తెలంగాణ వారసత్వానికి ప్రతీక అయిన ఇలాంటి భవనాన్ని ఎందుకు కూల్చాస్తారంటూ.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా కొన్ని పక్షాలు ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రొఫెసర విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా… సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. చివరకు మార్చి 10న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాన్ని కూల్చివేసుకోవచ్చునంటూ.. ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్ధించింది. దీంతో తెలుగు వారి.. దశాబ్దాల నాటి సచివాలయం.. త్వరలోనే చరిత్ర గర్భంలో కలిసిపోనుంది.