ఒకే స్టేషన్.. తండ్రి కానిస్టేబుల్, కొడుకు ఎస్పీ…!

-

కొడుకంటే తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి తప్పించేవాడని అంటారు పెద్దలు. కానీ.. ఈ కొడుకు చూడండి.. తండ్రి గౌరవాన్ని నిలబెట్టాడు. కన్న తండ్రి తల ఎత్తుకొని తిరిగేలా చేశాడు. తండ్రి కానిస్టేబుల్ అయినప్పటికీ.. కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు అదే తండ్రి పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీగా పనిచేస్తున్నాడు. ఓ తండ్రికి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఈ అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటు చేసుకున్నది.

విభూతిఖండ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా జనార్దన్ సింగ్ పనిచేస్తున్నాడు. ఆయన కొడుకు అనూప్ సింగ్ ఐపీఎస్ కు సెలక్టయ్యాడు. ఇటీవలే ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాడు. దీంతో కొడుకు అయినప్పటికీ.. తన పై ఆఫీసర్ కాబట్టి.. అనూప్ కు జనార్దన్ సెల్యూట్ చేసి గౌరవించాడు. ఇప్పుడే కాదు.. ఎప్పుడైనా ఆయన్ని బాస్ లాగే చూస్తానని జనార్దన్ చెప్పాడు. ఇంట్లోనే బంధాలు, బందుత్వాలు.. పోలీస్ స్టేషన్ లో ఎప్పటికీ ఆయన నా బాసే.. అంటున్నాడు జనార్దన్. వావ్.. బాగుంది కదా ఈ తండ్రీకొడుకుల అనుబంధం.

Read more RELATED
Recommended to you

Latest news