రాజకీయాలు అంటే ఆలోచించాల్సిందే: కౌశల్

-

కౌశల్.. బిగ్ బాస్ 2 షో ప్రారంభం వరకు కూడా ఈ పేరు ఎవరికీ తెలియదు. షో ప్రారంభం అయింది. కౌశల్ పేరు కూడా నెమ్మదిగా అందరికీ తెలియడం ప్రారంభమయింది. తర్వాత సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ పేరుతో పేజీలకు పేజీలు పుట్టుకురావడం, అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. చివరకు షోను గెలవడం వరకు అన్నీ కౌషల్ ఆర్మీ చేసిన ప్రచారమే. 2కే రన్స్, మారథాన్లు కూడా నిర్వహించారు కౌశల్ కోసం. వామ్మో.. ఆఫ్టరాల్ ఓ మోడల్, సీరియల్ నటుడు.. ఇతడికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏందిరా బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి చేరాయి. అయినా కూడా మనోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది కానీ తగ్గలేదు.

కట్ చేస్తే చాలా మంది ఆయన అభిమానులు కౌశల్ ని రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట. ఈమధ్య ఓసారి కర్నూలు వెళ్లాడట కౌశల్. దీంతో ఆయన అభిమానులు.. రాజకీయాల్లోకి రావాలంటూ సూచించారట. దానికి కౌశల్ స్పందించి… రాజకీయాల్లోకి వచ్చే విషయం గురించి ఆలోచించాలని.. అయితే.. రాజకీయాల్లోకి రాకుండా కూడా ప్రజలకు సేవ చేయొచ్చంటూ చెప్పాడట. ఏం చేసినా చివరకు సమాజ సేవ చేయడమే తన ఉద్దేశమంటూ వివరించాడట. ఇంతకీ.. ఆయన రాజకీయాల్లోకి వస్తానన్నట్టా? రానన్నట్టా? అని తన అభిమానులు నెత్తి గోక్కుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news