అయోధ్య రామ మందిరం వివాదం తెలిసిందే.. సుప్రీం ఆదేశాల ప్రకారం అక్కడ ఉన్న బాబ్రీ మస్జిద్ ను అధికారులు తొలగించారు ఆపై ఆ ప్రాంతంలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈపాటికే అక్కడ మందిర నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా ఆ పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. సాక్షాత్తు ప్రధాని మోడీ చేతుల మిదుగా మందిర శంఖుస్థాపం జరిగి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేవి కానీ లాక్ డౌన్ కారణంగా ప్రధాని పర్యటన జరగలేదు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇకపై కూడా ఆ ప్రాంతంలో ప్రధాని పర్యటన జరిగే సూచనలు ఏవి కనిపించడం లేదు.
దీంతో ప్రధాని మోడీని అయోధ్యకు పర్యటన చేయాలని మందిర శంఖుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధానికి లేఖ రాసింది. ఈ లేఖ లో ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మోడీ ని పర్యటన జరిగే సూచనలు లేకపోయినా కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనమని మోడీని కోరారు. రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే భూమి పూజ జరిగిన నేపథ్యంలో పనులను ప్రారంభించాలని భావిస్తున్న ట్రస్ట్.. శ్రావణమాసం చివరి రోజైన ఆగస్టు 5న నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తోంది. మరోవైపు, ఆలయాన్ని నిర్మించే ప్రదేశంలో భూమిని చదును చేసే పనులు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. అలాగే, రాళ్లను చెక్కే పని కూడా ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం రామ జన్మభూమి స్థలాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మందిర నిర్మాణం కోసం తన వ్యక్తిగత సొమ్ము నుంచి రూ. 11 లక్షలు విరాళంగా ఇచ్చారు.